Fire accident : కారు మెకానిక్‌ షెడ్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరి సజీవదహనం..

బొగ్గుల కుంటలోని ఓ కారు మెకానిక్‌ షెడ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 25 Mar 2023 08:12 IST

హైదరాబాద్‌ : బొగ్గుల కుంటలోని ఓ కారు మెకానిక్‌ షెడ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 కార్లు దగ్ధం కాగా.. కారులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో బొగ్గులకుంట పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని