logo

‘ఉర్దూ బడులను మినహాయించాల్సిందే’

విలీన ప్రక్రియ నుంచి ఉర్దూ పాఠశాలలను మినహాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పేరుతో ఉర్దూ పాఠశాలలను

Published : 23 Jan 2022 02:32 IST


వివరాలు వెల్లడిస్తున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : విలీన ప్రక్రియ నుంచి ఉర్దూ పాఠశాలలను మినహాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పేరుతో ఉర్దూ పాఠశాలలను ఇతర మాధ్యమ బడుల్లో కలపడం సరికాదన్నారు. ఉర్దూ ~ర3, 4, 5 తరగతుల విద్యార్థులను ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలోల కలపడం వలన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రయత్నాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఉర్దూ ఉపాధ్యాయులను ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తే ఆ ఉపాధ్యాయులు తమ వృత్తికి ఎలా న్యాయం చేయగలరో ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యంరాజు, కంభం బాలగంగిరెడ్డి, ఎస్‌ఎండీ ఇలియాస్‌బాషా, సత్యనారాయణ, మహబూబ్‌బాషా, విజయభాస్కర్‌, రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని