logo

మినీ స్టేడియం పనుల పూర్తికి ఆదేశం

సిరిసిల్లలో మినీ స్టేడియం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని మంగళవారం కలెక్టర్‌

Published : 19 Jan 2022 02:22 IST

గుత్తేదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: సిరిసిల్లలో మినీ స్టేడియం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని మంగళవారం కలెక్టర్‌ సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రూ.3 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల్లో ఆర్చి, సీసీరోడ్డు, వాకింగ్‌ ట్రాక్‌ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్చి నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

వ్యవసాయ పరికరాల కేంద్రం ఏర్పాటుకు చర్యలు
ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. పరిసరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు, ఐకేపీ సిబ్బందికి తగు సూచనలు చేసి సలహాలు అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రానికి ఒక ట్రాక్టర్‌, రొటోవేటర్‌, రౌండ్‌ బాలెర్‌ల పరికరాలు వచ్చినట్లు పేర్కొన్నారు. (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌) వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనున్నందున్న వీటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సందేహలు ఉంటే ఎల్లారెడ్డిపేటలోని కేంద్రం నిర్వాహకుల ద్వారా తగు సూచనలు, సలహాలు పొందాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించాక అదనంగా పరికరాలు అవసరమైతే ప్రతిపాదనలు పంపిస్తే సమకూర్చడానికి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, వ్యవసాయ అధికారి వెంకటేశ్‌, ఏపీవో ఆనంద్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని