logo

అయ్యో పాపం... ఎంతఘోరం!

మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ స్నేహితులు పరీక్షలు ముగియగానే సెలవులను ఆనందంగా గడపాలని భావించారు. గురువారం వేసవి తాపానికి ఈత కొడదామని వెళ్లారు. చెరువే మృత్యు రూపంలో వారిని

Published : 20 May 2022 03:24 IST

చెరువులో మునిగి ఇద్దరు స్నేహితుల మృతి

గంభీరావుపేట, న్యూస్‌టుడే: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ స్నేహితులు పరీక్షలు ముగియగానే సెలవులను ఆనందంగా గడపాలని భావించారు. గురువారం వేసవి తాపానికి ఈత కొడదామని వెళ్లారు. చెరువే మృత్యు రూపంలో వారిని బలిగొనడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చిన్న కర్రోల్ల లక్షి- వెంకటిలకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు రవితేజ గంభీరావుపేట జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. అదేవిధంగా మహ్మద్‌ గౌసియ- షకిల్‌లకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు సమీర్‌ గంభీరావుపేటలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. సమీర్, రవితేజ ఇద్దరు ప్రాణస్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. పరీక్షలు ముగియటంతో సరదాగా ఈత కొడదామని గురువారం గంభీరావుపేటలోని నమాజ్‌ చెరువుకు వెళ్లారు. వీరితోపాటు స్నేహితుడు రేవంత్, సమీర్‌ తమ్ముడు చాంద్‌లు కూడా వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. మొదట ఒడ్డునే ఉండి ప్లాస్టిక్‌ బాటిళ్ల సహాయంతో సమీర్, రవితేజలు ఈత కొట్టారు. బాటిళ్లు లేకుండా కొద్దిగా ముందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్నారు. వారిని చూసిన బయట ఉన్న ఇద్దరు కాపాడే ప్రయత్నం చేశారు. సమీర్‌ తమ్ముడు చాంద్‌ చాలా ప్రయత్నం చేశాడు. అటుగా వెళుతున్న వారి సాయం కోరినప్పటికి వారు సైతం వీరిని లోతుకు వెళ్లవద్దని వారించారు. వెంటనే గ్రామంలోకి చేరుకుని విషయం చెప్పారు. యువకులు చేరుకుని  ఎంత వెతికినా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని జాలర్లను పిలిపించారు. సాయంత్రం అయిదు గంటల వరకు గాలించగా రెండు మృతదేహాలు లభించాయి. గ్రామంలో విషాదంలో నెలకొంది. ఇద్దరి మృతితో వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. రవితేజ తండ్రి వెంకటి గల్ఫ్‌లో ఉండగా, సమీర్‌ తండ్రి షకిల్‌ ముంబయిలో ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్షకు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి సీఐ మొగిలి పరిశీలించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సీఐ తెలిపారు. చెరువులు నిండి ఉన్నాయని, బయటకు పంపించవద్దని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని