logo

ప్రతిభ ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు

గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పైరవీ చేస్తేనే వచ్చేవని ఇప్పుడు పైరవీలకు కాదు ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

Published : 22 May 2022 04:09 IST

మంత్రి గంగుల కమలాకర్‌


మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పైరవీ చేస్తేనే వచ్చేవని ఇప్పుడు పైరవీలకు కాదు ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతిగృహా విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక పోటీ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ కేవలం వెయ్యి ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చేవారని ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. మౌఖిక పరీక్షలు లేవని రాత పరీక్షకే మార్కులని చెప్పారు. కష్టపడి చదవాలని బీసీ బిడ్డలకే అధికంగా ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది బీసీ గురుకులాల్లో 16వేల మంది విద్యార్థులు చదువుకోగా నేడు 282 గురుకులాల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థినులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్‌వీ. కర్ణన్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ సేవ ఇస్లావత్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌ పాల్గొన్నారు.

తూకం వేయగానే రసీదు ఇవ్వాలి

భగత్‌నగర్‌ : రైస్‌ మిల్లర్లు ధాన్యం వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రసీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ వై.సునీల్‌రావు, అదనపు పాలనాధికారి గరిమా అగ్రవాల్‌, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి సురేశ్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు