logo

వ్యాధుల కాలం.. అవగాహనతో రక్ష

వేసవి తర్వాత వచ్చే వానాకాలం వ్యాధులను మోసుకొస్తుంది. తొలకరి వర్షాల సమయంలో నీరు కలుషితం అవుతుంటుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో చిన్నపిల్లలకు నీళ్ల విరేచనాలు అధికంగా అవుతుంటాయి. ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని

Published : 24 Jun 2022 04:25 IST

జిల్లాలో కొనసాగుతున్న నీళ్ల విరేచనాల నియంత్రణ పక్షోత్సవాలు

న్యూస్‌టుడే, మెట్‌పల్లి

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందిస్తున్న వైద్య సిబ్బంది 

వేసవి తర్వాత వచ్చే వానాకాలం వ్యాధులను మోసుకొస్తుంది. తొలకరి వర్షాల సమయంలో నీరు కలుషితం అవుతుంటుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో చిన్నపిల్లలకు నీళ్ల విరేచనాలు అధికంగా అవుతుంటాయి. ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వ నివేదికలు పేర్కొంటున్నాయి. 2025 నాటికి చిన్నారుల మరణాల రేటును తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 13 నుంచి 27 వరకు నీళ్ల విరేచనాల నియంత్రణ పక్షోత్సవాలను నిర్వహిస్తోంది. జిల్లాలో ఐదు పురపాలిక సంఘాలు, 18 మండలాల్లోని 22 పీహెచ్‌సీల్లో 92,225 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు. పది రోజుల్లో దాదాపు 80 శాతం ప్యాకెట్లు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అవగాహన ఇలా..: జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చిన్నారులు నీళ్ల విరేచనాల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బంది, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్‌ఎస్, జింక్‌ మాత్రలను అందిస్తున్నారు. నీళ్ల విరేచనాలు కలిగితే ఓఆర్‌ఎస్‌ పొడిని నీళ్లలో కలిపి ఎలా తాగించాలో వివరిస్తున్నారు. రెండో వారంలో చేతుల శుభ్రత ప్రాధాన్యతను, శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిసస్తున్నారు. ఇటుక బట్టీలు, క్వారీ ప్రాంతాల్లో చిన్నారుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరణాల తగ్గింపే లక్ష్యంగా.. - డాక్టర్‌ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి, జగిత్యాల

నీళ్ల విరేచనాల వల్ల సంభవించే మరణాల తగ్గింపే లక్ష్యంగా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ నెల 13 నుంచి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు చిన్నారుల ఇళ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ మాత్రలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాం. చిన్నారుల తల్లిదండ్రులు వైద్య సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని