logo

ఘనంగా బతుకమ్మ పండగ

మండలంలో  రామడుగు, గోపాల్‌రావుపేట, వెదిర, వెలిచాల, దేశరాజ్‌పల్లి, కొక్కెరకుంట, రుద్రారంతో పాటు అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండగతో మహిళలు సందడి చేశారు.

Updated : 04 Oct 2022 06:37 IST

కరీంనగర్‌లో మహాశక్తి ఆలయంలో..

రామడుగు: మండలంలో  రామడుగు, గోపాల్‌రావుపేట, వెదిర, వెలిచాల, దేశరాజ్‌పల్లి, కొక్కెరకుంట, రుద్రారంతో పాటు అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండగతో మహిళలు సందడి చేశారు.

గంగాధర : గంగాధర మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కోలాటం, దాండియా నృత్యాలతో చిన్నారులు, యువతులు, మహిళలు అలరించారు. అనంతరం నిమజ్జనం చేశారు.

మానకొండూర్‌: మానకొండూర్‌ పెద్ద చెరువు వద్దకు  కరీంనగర్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి చెరువు కట్టపై బతుకమ్మ ఆట పాటలు పాడుతూ సంబురాలు చేసుకున్నారు. స్థానిక మహిళలు కూడా తరలివచ్చి బతుకమ్మ ఆడారు.అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ స్వీయ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సర్పంచి రొడ్డ పృధ్వీరాజ్, జడ్పీటీసీ సభ్యులు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

వీణవంక: వీణవంకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నీల కుమారస్వామి, వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి పాల్గొన్నారు. 

చొప్పదండి: మండలంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

బతుకమ్మతో డిప్యూటీ మేయర్‌ స్వరూపరాణి

మానేరు ఒడిలో బతుకమ్మలు..

జమ్మికుంటలో...

భగత్‌నగర్‌లో  మేయర్‌ సతీమణి అపర్ణ

హుజూరాబాద్‌లో బతుకమ్మను ఎత్తుకున్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి 

 గంగాధర కూడలిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు 

తాడికల్‌లో..

మధురానగర్‌లో బతుకమ్మ సంబరాలు   

పోరండ్లలో..

కరీంనగర్‌లో యువత సందడి

సంతోష్‌నగర్‌లో... 

చొప్పదండిలో.. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని