logo

స్వచ్ఛత దిశగా పల్లెలు

జాతీయ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 27 గ్రామ పంచాయతీలను గుర్తించారు.

Updated : 24 Mar 2023 04:41 IST

జిల్లాలో 27 ఉత్తమ పంచాయతీల ఎంపిక

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జాతీయ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 27 గ్రామ పంచాయతీలను గుర్తించారు. తొమ్మిది కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గతంలో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు పురస్కారాలు లభించేది. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తున్నారు. ఉత్తమ పంచాయతీలకు ఈ నెల 25న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పాలనాధికారిణి డాక్టర్‌ సర్వే సంగీత చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు పంపిణీ చేస్తామని అదనపు పాలనాధికారి కుమార్‌దీపక్‌ తెలిపారు.

ఆయా విభాగాలు -  ఎంపికైన గ్రామాల వివరాలు..

పేదరికం లేని మెరుగైన జీవనోపాధి :  ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌, పెద్దపల్లి మండలం చీకురాయి, ముత్తారం.

ఆరోగ్యకరమైన పంచాయతీ : ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌, మంథని మండలం నాగారం, రామగిరి మండలం నాగేపల్లి.

పిల్లల స్నేహపూర్వక విభాగం : కమాన్‌పూర్‌, జూలపల్లి, ఓదెల మండలం భీమరపల్లి, పెద్దపల్లి మండలం పెద్దకల్వల.

నీటి సమృద్ధి పంచాయతీ కేటగిరీ : జూలపల్లి మండలం వెంకట్రావ్‌పల్లి, కమన్‌పూర్‌ మండలం జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం లక్ష్మీపూర్‌.

పరిశుభ్రత, పచ్చదనం : ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌, మంథని మండలం నాగారం, రామగిరి మండలం నాగేపల్లి.

స్వయం సమృద్ధి, మౌలిక వసతుల కల్పన : ధర్మారం మండలం కటికనపల్లి, రామగిరి మండల రత్నాపూర్‌, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి.

సామాజిక భద్రత విభాగం  :

ముత్తారం మండలం ఓడేడు, ఓదెల మండలం ఉప్పరపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం, సుపరిపాలనలో ధర్మారం మండలం ధర్మారం, రామగిరి మండలం నాగేపల్లి, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి.

మహిళా స్వేహపూర్వక విభాగం : ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌, మంథని మండలం చిల్లపల్లి, సుల్తానాబాద్‌ మండలం సుద్దాల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని