logo

న్యాయవాదులకు వరం.. డిజిటల్‌ లైబ్రరీ

డిజిటల్‌ లైబ్రరీతో న్యాయవాదులు వృత్తిలో మరింత రాణిస్తారని హైకోర్టు న్యాయమూర్తి (జిల్లా పరిపాలన) జస్టిస్‌ కన్నెగంటి లలిత అన్నారు.

Published : 26 Mar 2023 05:05 IST

మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత

చైతన్యపురి, న్యూస్‌టుడే: డిజిటల్‌ లైబ్రరీతో న్యాయవాదులు వృత్తిలో మరింత రాణిస్తారని హైకోర్టు న్యాయమూర్తి (జిల్లా పరిపాలన) జస్టిస్‌ కన్నెగంటి లలిత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన డిజిటల్‌ లైబ్రరీ భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదులతోనే బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ చైతన్యవంతమైందని, జిల్లా పరిపాలన న్యాయమూర్తిగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుల్లో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఇక్కడి వారు విదేశాల్లో కేసులు వాదించవచ్చని, అక్కడి వారు ఇక్కడివి వాదించవచ్చని, ఇది గొప్ప పరిణామమని అన్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని, మరో నాలుగు కోర్టులు మంజూరు చేయడంతోపాటు జూనియర్‌ సివిల్‌ జడ్జిలను నియమించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి పోర్టుపోలియో న్యాయమూర్తిని కోరారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని