logo

పోషకాహారంతో రక్తహీనత దూరం

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఐరన్‌, చిరుధాన్యాల ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, రక్తహీనతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు.

Published : 26 Mar 2023 05:05 IST

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ కర్ణన్‌

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే : రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఐరన్‌, చిరుధాన్యాల ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, రక్తహీనతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు. మండలంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్‌ కళాశాలలో పోషణ్‌ అభియాన్‌లో భాగంగా శనివారం ఫార్మసీ విద్యార్థులకు రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి అనీమియా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి సబితా కుమారి, తహసీల్దార్‌ కనకయ్య, వైద్యాధికారులు, సీడీపీవోలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని