logo

పరిహారం ఇవ్వాలని ఆందోళన

ఇటీవల వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి  ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఇప్పటీకి ఇవ్వకపోవటంపై భాజపా మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రూరల్‌ మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

Published : 09 Jun 2023 04:54 IST

కరీంనగర్‌ రూరల్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన భాజపా నాయకులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇటీవల వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి  ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఇప్పటీకి ఇవ్వకపోవటంపై భాజపా మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రూరల్‌ మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు రామచంద్రం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


రైతు పక్షపాతి మోదీ ప్రభుత్వం

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తోందని భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. 2014 నుంచి నేటి వరకు వివిధ పంటలకు మద్దతు ధరలను గణనీయంగా పెంచుతూ మోదీ సర్కార్‌ రైతు పక్షపాతిగా నిలిచిందన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు దరలు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు. వరికి క్వింటాలుకు రూ.143, పెసళ్లకు రూ.823, రాగులకు రూ.268 చొప్పున పెంచిందన్నారు. మోదీ సర్కార్‌  రైతులకు అండగా నిలుస్తుందన్నారు.
తిమ్మాపూర్‌  : భారాసది మోసపూరిత పాలన అని.. ఆ పార్టీని రానున్న ఎన్నికలలో ఓడించాలని భాజపా మండలాధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. మండలంలోని మల్లాపూర్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని