logo

ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం

నామినేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌లు పాల్గొన్నారు.

Published : 18 Apr 2024 04:23 IST

ప్రతి ఒక్కరికీ చేరేలా స్లిప్పుల పంపిణీ      
దృశ్యమాధ్యమ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

దృశ్యమాధ్యమ సమావేశంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్‌లు అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నామినేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌లు పాల్గొన్నారు. జిల్లా సమీకృత పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, తుది ఓటరు జాబితాలను తయారు చేయాలన్నారు. ఓటరు నమోదు దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని, ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్క ఓటరుకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసేటప్పుడు అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్‌ల స్వీకరణ నుంచి ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు వరకు ప్రతి అంశాన్ని పాటించాలన్నారు. నామినేషన్‌ సమర్పించే గది లోపలికి రావడానికి, బయటకు వెళ్లేందుకు వేర్వేరుగా మార్గాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రం వద్ద ఉచిత సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, నామినేషన్‌ ప్రక్రియను వీడియో, ఫొటోగ్రఫీ తీయించాలన్నారు. సమావేశంలో అధికారులు హనుమాన్‌నాయక్‌, గంగయ్య, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌, కుమారస్వామి, ప్రవీణ్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని