logo

రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం

వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు.

Published : 18 Apr 2024 04:35 IST

భార్య కౌసల్యతో...

న్యూస్‌టుడే, గంగాధర: వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ చదివి ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి ఏకైక రాజకీయ పక్షమైన ఆంధ్ర మహాసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పలు పదవులు నిర్వహించారు. 1962-67, 1967-71 కాలంలో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు కాడెడ్లు. రమాపతిరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని