logo

తెరుచుకున్న పాఠశాలలు

కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌ ద్వారా తరగతల

Published : 25 Jan 2022 04:37 IST

బళ్లారి, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌ ద్వారా తరగతలను నిర్వహించారు. జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి సోమవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు వెలుగులోకి వస్తే ఐదు రోజులపాటు సీల్‌డౌన్‌ చేయాలని ఆదేశించారు. డీసీ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం బడిగంటలు మోగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు హాజరు 50శాతం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి సి.రామప్ప ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ హూవినహడగలి తాలూకాలో రెండు కూడ్లిగి, సిరుగుప్ప, కురుగోడు తాలూకాల్లో ఒక్కొక్క పాఠశాలలను ఐదు రోజులపాటు సీల్‌డౌన్‌ చేశాం. వైరస్‌ సోకిన విద్యార్థులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని