logo

వైభవంగా కన్నడ హారతి ఊరేగింపు

స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు, ఆదర్శాలను భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన అజాదీ కీ అమృత మహోత్సవం, అమృత భారతి కన్నడ హారతి కార్యక్రమాన్ని సోమవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవర

Published : 28 Jun 2022 01:02 IST

విద్యార్థులు, ముత్తైదువులు కళశాలతో ఊరేగింపు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు, ఆదర్శాలను భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన అజాదీ కీ అమృత మహోత్సవం, అమృత భారతి కన్నడ హారతి కార్యక్రమాన్ని సోమవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో శాసనసభ్యుడు ఎం.ఎస్‌.సోమలింగప్ప డోలు  వాయించి ఊరేగింపు ప్రారంభించారు. విద్యార్థులు, ముత్తైదువులు కళశాలు, వాద్య బృందాలు, మేళతాళాలు వంటి వాటితో వివిధ నృత్యాలతో పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా తాలూకా క్రీడా మైదానానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ మంజునాథ స్వామి, సాంస్కృతిక శాఖ సహాయక నిర్దేశకుడు సిద్దలింగేశ్‌ రంగణ్ణనవర్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జలాలప్ప, విద్యాశాఖ అధికారి పి.డి.భజంత్రి, కార్యక్రమ సంచాలకుడు ఎం.ఎస్‌.సిద్దప్ప పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని