logo

హైకోర్టును ఆశ్రయించిన డీకే

తనపై సీబీఐ నమోదు చేసిన అక్రమ ఆస్తుల కేసును రద్దు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు హైకోర్టు సీబీఐకి అవకాశాన్ని ఇచ్చింది. ఆక్షేపణల అర్జీ దాఖలు చేసేందుకు రెండువారాల కాలావకాశం

Published : 11 Aug 2022 05:58 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : తనపై సీబీఐ నమోదు చేసిన అక్రమ ఆస్తుల కేసును రద్దు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు హైకోర్టు సీబీఐకి అవకాశాన్ని ఇచ్చింది. ఆక్షేపణల అర్జీ దాఖలు చేసేందుకు రెండువారాల కాలావకాశం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది పి.ప్రసన్నకుమార్‌ కోరారు. దీనిపై 29వ తేదీలోగా ఆక్షేపణలు తెలియజేయాలని జస్టిస్‌ సునీల్‌ దత్‌ యాదవ్‌ ఆదేశించారు. శివకుమార్‌ భూవ్యాపారం, విద్యా సంస్థలు, వ్యవసాయం, ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారని, క్రమం తప్పకుండా ఆదాయ పన్ను చెల్లిస్తూ వచ్చారని ఆయన తరఫు న్యాయవాది సి.హెచ్‌.జాధవ్‌ వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని