logo

రైలు నిలయాలకు.. ఆధునిక హంగులు

రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్లను సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయడంతో అధికారులు మునిగిపోయారు.

Updated : 06 Feb 2023 04:04 IST

రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్ల అభివృద్ధి

సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ తరహాలో పలు స్టేషన్లు రానున్నాయి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్లను సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయడంతో అధికారులు మునిగిపోయారు. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రంలోని రైలు పథకాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.7,561కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. 2009-2013తో పోలిస్తే నిధులు కేటాయింపులో తొమ్మిదివందల శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రూ.49,336 కోట్లు వ్యయంతో 4,330 కిలోమీటర్ల రైల్వే పనులు సాగుతున్నాయి. అందులో గేజ్‌ మార్పు, కొత్త మార్గాలు నిర్మాణం, 11 ద్విపథ మార్గాలు చేరి ఉన్నాయి. నైరుతి రైల్వే విభాగంలో రూ.9,200కోట్లు ప్రతిపాదించగా రూ.527కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మైసూరు నవలూరు రైల్వేషెడ్‌ నిర్మాణానికి రూ.వేయి కోట్లు, యశ్వంతపుర- చిక్కబాణావర విద్యుద్దీకరణ, కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌- వైట్‌ఫీల్డ్‌ రైల్వేస్టేషన్‌ వరకు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పని చేసే సిగ్నల్‌ వ్యవస్థ చేపడతారు.

* కోట్టూరు- హరిహర 65 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించారు. కడూరు- చిక్కమగళూరు- సకలేశపుర 92 కిలోమీటర్లకు రూ.145కోట్లు, హసన్‌-బెంగళూరు 166 కి.మీ రూ.33 కోట్లు, హొబ్బళ్లి- అంకోలా 167 కి.మీ రూ.12 కోట్లు, రాయదుర్గం- తుమకూరు 213 కి.మీ రూ.350 కోట్లు, బాగల్‌కోట్‌- కుడచి 142 కి.మీ రూ.360 కోట్లు, తుమకూరు- దావణగెరె 199 కి.మీ రూ.420 కోట్లు, వైట్‌ఫీల్డ్‌- కోలారు 52 కి.మీ రూ.10 కోట్లు, మారికుప్పం- కుప్పం 23 కి.మీ రూ.200కోట్లు, గదగ- వాడి 252కి.మీ రూ.350కోట్లు, శివమొగ్గ- శికారిపుర- రాణిబెన్నూరు 103కి.మీ రూ.150కోట్లు, హసన్‌-బేలూరు 32కి.మీ రూ.60కోట్లు, బెళగావి- ధార్వాడ్‌ 73కి.మీ రూ.10కోట్లు కేటాయించారు.

* ద్విపథ రైలు మార్గాల నిర్మాణానికి బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌- కె.ఆర్‌.పురం 23కి.మీ రూ.250కోట్లు, హొసపేట- వాస్కో 352కి.మీ రూ.400కోట్లు, గదగ- హొట్టి 284కి.మీ రూ.170కోట్లు, హొబ్బళ్లి- చిక్కజుజూరు 190కి.మీ రూ.150కోట్లు, యశ్వంతపుర- చిన్నసంద్ర 21కి.మీ రూ.85కోట్లు, ధర్మవరం- పెనుకొండ 41కి.మీ రూ.120కోట్లు, బయ్యప్పనహళ్లి- హోసూరు 48కిలోమీటర్ల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు.

నానాటికీ పెరుగుతున్న రైల్వే ప్రయాణికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని