logo

ఓటమిని సవాలుగా స్వీకరిద్దాం

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. ఓటమిని సవాలుగా తీసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదామని కనకగిరి మాజీ శాసనసభ్యుడు దడేసుగూరు బసవరాజ్‌ పార్టీ శ్రేణలకు సూచించారు.

Published : 17 May 2023 01:50 IST

కంట తడిపెట్టిన దడేసుగూరు బసవరాజ్‌

కారటగి, న్యూస్‌టుడే : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. ఓటమిని సవాలుగా తీసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదామని కనకగిరి మాజీ శాసనసభ్యుడు దడేసుగూరు బసవరాజ్‌ పార్టీ శ్రేణలకు సూచించారు. కారటగిలో మంగళవారం జరిగిన ఆత్మావలోకన సమావేశంలో ఆయన మాట్లాడారు. యడియూరప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడం, పార్టీ ఎన్నికల ప్రణాళిక ఆలస్యంగా విడుదల చేయడం, ప్రణాళిక ప్రజలను ఆకర్షించకపోవడం పార్టీ ఓటమికి కారణాలన్నారు. మరోవైపు నాపై లేని పోని ఆరోపణలు, అసత్య ప్రచారాలు నా ఓటమికి కారణమైందని కంట తడి పెట్టారు. 2009 నుంచి తనకు అండగా ఉంటున్న కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు తాలూకాల్లో 60 వేలకు పైగా ఓటర్లు తనపై విశ్వాసం ఉంచారు. వారికి రుణపడి ఉంటాను. కార్యకర్తలకు జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో అండగా ఉండి వారి విజయానికి కృషి చేస్తానని తెలిపారు. నాయకులు నాగరాజ బిల్గార్‌, వీరేశ్‌ సాలోణి మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర ముసాలి, వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని