logo

Love-Murder: యువకుడిని కడతేర్చిన ప్రేమ

ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. తన ప్రేమకు అడ్డు రావద్దని హెచ్చరించినా చేతన్‌ అనే యువకుడు వెనక్కు తగ్గకపోవడంతో ఆమెను ప్రేమించిన మరో యువకుడు సతీశ్‌ తన సహచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు.

Updated : 05 Nov 2023 07:04 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. తన ప్రేమకు అడ్డు రావద్దని హెచ్చరించినా చేతన్‌ అనే యువకుడు వెనక్కు తగ్గకపోవడంతో ఆమెను ప్రేమించిన మరో యువకుడు సతీశ్‌ తన సహచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కోలారు జిల్లా మాలూరు సమీపంలోని అయ్యప్పనగరకు చెందిన చేతన్‌ మరణించాడు. హత్య చేసిన సతీశ్‌- అతని అనుచరులు శశి, శోభను సర్జాపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలింపు తీవ్రం చేశారు. చేతన్‌కు గత అక్టోబరు 26న మద్యం తాగించిన సతీశ్‌, దక్షిణ పినాకిని కాలువ వద్దకు తీసుకువెళ్లి తన సహచరులతో కలిసి చేతన్‌ను హత్య చేసి పరారయ్యారు. దర్యాప్తులో ఈ విషయం తేలిందని పోలీసులు శనివారం వెల్లడించారు. ఈక్రమంలోనే నిందితులను అరెస్టు చేశారు. అత్తిబెలె ఠాణా పరిధిలో గతంలో జరిగిన హత్య కేసులో శోభ కారాగారంలో శిక్ష  అనుభవించి జామీనుపై బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు.

విద్యార్థినిపై మాజీ ప్రియుని దాడి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న ద్వితీయ బీకాం విద్యార్థినిపై ఆమె మాజీ ప్రియుడు నరేశ్‌ దాడి చేశాడు. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైన ఘటన కెంగేరి పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేశ్‌ మైసూరు రోడ్డు వండర్‌లాలో ఉద్యోగి. ఏడాదిన్నర పాటు ఆ యువతితో ప్రేమ కొనసాగించాడు. అభిప్రాయ భేదాలు రావడంతో నరేశ్‌కు ఆ విద్యార్థిని దూరమైంది. పదేపదే ఫోన్లు చేయడం, సందేశాలు పంపించడంతో అతని నంబరును ఆమె బ్లాక్‌ చేసింది. దీంతో అతను దారి కాచి ఆమెపై దాడి చేశాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్న నిందితుని కోసం కెంగేరి ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని