logo

వలపుల వలలో చిక్కి ఓ నిర్మాత విలవిల.. దర్శకుడి అరెస్టు

ఓ యువతి పన్నిన వలపుల వలలో చిక్కి ఓ నిర్మాత విలవిలలాడిన ఘటన బెంగళూరు పోలీసులను విస్తుపోయేలా చేసింది. అలా వలపన్ని.. డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన సినీరంగానికే చెందిన వ్యక్తి, దర్శకుడు రవీంద్రను నగర పడమటి విభాగం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Updated : 24 Nov 2023 09:00 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఓ యువతి పన్నిన వలపుల వలలో చిక్కి ఓ నిర్మాత విలవిలలాడిన ఘటన బెంగళూరు పోలీసులను విస్తుపోయేలా చేసింది. అలా వలపన్ని.. డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన సినీరంగానికే చెందిన వ్యక్తి, దర్శకుడు రవీంద్రను నగర పడమటి విభాగం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. యువతుల సాయంతో లైంగిక బెదిరింపులకు పాల్పడి, నిర్మాతల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించే పథకాన్ని వమ్ము చేసినట్లు అధికారులు వివరించారు. నిర్మాత మహదేవ్‌ వద్దకు యువతులను పంపించి డబ్బు కోసం బెదిరించారనే ఆరోపణలను పరిగణలోనికి తీసుకుని రవీంద్ర ఆటకట్టించారు. తనకు ఎదురైన ఇబ్బందిని బాధిత నిర్మాత అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర సినిమాలకు మహదేవ్‌ నిర్మాతగా వ్యవహరించారు. నిందితుడు రవీంద్ర ‘బారబాత్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని