logo

కరడికి చేయందించిన కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా టికెట్‌ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్‌సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్‌లో చేరారు.

Published : 18 Apr 2024 02:48 IST

కరడి సంగణ్ణకు కాంగ్రెస్‌ జెండా అందిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాజపా టికెట్‌ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్‌సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ సవది తదితరులు ఆయనకు పార్టీ పతాకాన్ని అందజేసి, స్వాగతం పలికారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్‌ అధికారి పుట్టస్వామి, జేడీఎస్‌ నేత దాసరహళ్లి కృష్ణమూర్తి, ప్రముఖ పాత్రికేయుడు స్వాతి చంద్రశేఖర్‌ తదితరులు హస్తం గూటికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి డీకే మాట్లాడుతూ కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలిచారని, విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీస్తోందన్నారు. భాజపా ఎన్నికల ప్రణాళికలో ఏమీలేదని, గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన వాటినే అమలులోకి తీసుకురాలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ పథకాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి శివరాజ్‌ తంగడగి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని