logo

కట్టుదిట్టంగా సీఈటీ

ఇంజినీరింగ్‌, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు.

Published : 19 Apr 2024 03:14 IST

కోలారులోని ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఇంజినీరింగ్‌, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. ఇందులో 167 కేంద్రాలు బెంగళూరులోనే ఉన్నాయి. ఈ ఏడాది 3,49,637 మంది పరీక్షకు హాజరయ్యారు. బయాలజీ, గణితం పరీక్షలను గురువారం నిర్వహించగా, శుక్రవారం భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంలో పరీక్షలు ఉంటాయి. ఆంగ్లం, కన్నడ భాషల్లో ప్రశ్నపత్రాన్ని ముద్రించారు. కన్నడలో ఏదైనా లోపం ఉంటే, ఆంగ్లంలోని ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని పరీక్ష ప్రాధికార ఇప్పటికే స్పష్టం చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, చేతి గడియారం, ఇయర్‌ఫోన్‌ చరవాణులు, కాలుక్యులేటర్లు తదితరాలను తీసుకువెళ్లకుండా సోదాలు నిర్వహించిన అనంతరమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మహిళా అభ్యర్థులకు మాంగల్యం మినహా ఏ ఇతర ఆభరణాలను అనుమతించలేదు. ఓఎంఆర్‌ షీట్లపై సమయం, పేర్లు, ఇతర వివరాలను రాస్తే దాన్ని మూల్యాంకనకు పరిగణనలోకి తీసుకోరు. సీఈటీకి మొత్తం 16 సెట్ల ప్రశ్న పత్రాలను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ నిషేధాజ్ఞలను జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని