logo

క్రీడా ప్రాంగణం.. ఔత్సాహికులకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల సేకరణ చేపట్టాలని అధికార

Updated : 02 Jun 2022 04:13 IST

జిల్లాలో 1,280 గ్రామాల్లో ఏర్పాట్లు

530 చోట్ల స్థలాల గుర్తింపు

ఇల్లెందు పట్టణం, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఉపాధి హామీ నిధులతో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం(టీకేపీ) పేరిట ప్రాంగణాలు నిర్మించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి స్థల సేకరణ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాల పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో 1,280 గ్రామాల్లో 1,280 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 530 గ్రామాల్లో స్థలాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా క్రీడా ప్రాంగణ స్థల సేకరణ పూర్తి చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఒక్కో క్రీడా ప్రాంగణం ఎకరం విస్తీర్ణం తగ్గకుండా నిర్మించనున్నారు. ఈ క్రీడా ప్రాంగణంలో కోకో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌జంప్‌ పిట్‌, ఎక్సర్‌సైజ్‌ బార్‌ సింగిల్‌ అండ్‌ డబుల్‌ ఉండే విధంగా రూపకల్పన చేశారు. జంగిల్‌ కటింగ్‌, మొట్లు తొలగింపు, భూమి చదును, గ్రావెల్‌ తోలకం, వాటర్‌ స్ప్రే చేయించనున్నారు. ఒక్కో క్రీడా ప్రాంగణం రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.


* క్రీడా ప్రాంగణం చుట్టూ ఒక్క వరుసలో 300 మొక్కలు నాటనున్నారు. స్థానిక గ్రామపంచాయతీ నర్సరీల్లో లభించే గుల్మోర్‌, వేప, కానుగ, బాదం, తంగేడు, చింత వంటి మొక్కలను 0.75 మీటర్ల నుంచి 1 మీటరు దూరంలో నాటాలని నిర్ణయించారు.


పలుచోట్ల పనులు ప్రారంభం

మధుసూదన్‌రాజు, డీఆర్‌డీఓ

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు గ్రామాల్లో స్థల సేకరణ వేగంగా జరుగుతుంది. స్థలాలు గుర్తించిన దగ్గర పనులు కూడా ప్రారంభించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించనున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని