logo

రామయ్యకు బంగారు తులసీ దళార్చన

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.

Published : 28 Apr 2024 01:16 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు. అర్చకులు బంగారు తులసి పూజలు చేశారు. తులసీ దళాలను స్వామివారి పాదాల చెంత ఉంచి అర్చన జరిపారు. క్షేత్ర విశిష్టతను భక్తులకు వివరించారు. ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్‌ నేతృత్వంలో కన్యాదానం చేసి కంకణ ధారణ నిర్వహించారు. మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక ఆనందంలో ముంచెత్తింది. దర్బారు సేవ మైమరపింపజేసింది. భద్రాచలం పట్టణానికి చెందిన ఎ.సత్యనారాయణ అనే భక్తుడు రూ.1.10 లక్షలు, వరంగల్‌కు చెందిన ఎం.మాలతి అనే భక్తురాలు రూ.1.30 లక్షల విరాళాన్ని అందించగా ఈ మొత్తంతో భక్తి కీర్తనలు వినిపించేందుకు సౌండ్‌సిస్టం ఏర్పాటు  చేశారు. ‘ఓం శ్రీరామాయ నమః’ నామం భక్తులకు వినిపించేలా కోవెల ప్రాంగణంలో పలు చోట్ల స్పీకర్లు అమర్చారు. ఈ వ్యవస్థను ఈఓ రమాదేవి ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని