logo

మోపిదేవి మండలంలో నలుగురికి కొవిడ్‌

మండల పరిధిలోని మెరకనపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో

Updated : 21 Jan 2022 15:13 IST

మోపిదేవి : మండల పరిధిలోని మెరకనపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌ సోకింది. దీంతో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. బుధవారం పాఠశాలలోని 23మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా.. అందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఎంఈవో ఆదేశాల మేరకు పాఠశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హెచ్‌ఎం పద్మజ తెలిపారు. ఈవోపీఆర్డీ అరుణకుమారి, పంచాయతీ సెక్రటరీ రామ కోటేశ్వరరావులు పాఠశాలకు వెళ్లి శానిటైజేషన్‌ చేయించారు. 

ఇద్దరు స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు కూడా కొవిడ్‌ నిర్ధారణ కావడంతో బ్యాంకుకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నామని మేనేజర్‌ సుబ్రహ్మణేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని