logo

సమన్వయంతో పనిచేయండి

ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌మిశ్రా అధికారులకు సూచించారు.

Published : 10 May 2024 05:52 IST

 వివిధ అంశాలను వివరిస్తున్న ఎస్పీ అస్మి
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురవారం ఆయన కలెక్టర్‌ బాలాజీ, ఐజీ అశోక్‌కుమార్‌, కేంద్ర పరిశీలకులు ప్రసాద్‌ప్రలాద్‌, జాన్‌కింగ్స్‌లే, నరహరిసింగ్‌బంగర్‌, ప్రవీణ్‌మోహన్‌దాస్‌, వికాస్‌చంద్రకరోల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించుకునేలా పోలీస్‌ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచిస్తూ పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, బందోబస్తు ఏర్పాట్లు, చెక్‌పోస్టుల పనితీరు, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, తదితరాల గురించి ఎస్పీ నయీమ్‌ అస్మి అధికారులకు వివరించారు. జేసీ గీతాంజలి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అంశాలకు సంబంధించిన నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గురువారం సందర్శించారు. స్ట్రాంగ్‌రూంలు, లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు, బార్కేడింగ్‌, పార్కింగ్‌ ప్రదేశం, సీసీ టీవీల డిస్‌ప్లే విధానం తదితరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఏఎస్పీలు జి.వెంకటేశ్వరరావు, ఎస్‌వీడీ ప్రసాద్‌, ఏడీ సర్వే మనీషాత్రిపాఠి, పీఆర్‌ ఎస్‌ఈ విజయకుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసరావు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని