logo

గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు

తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు.

Published : 10 May 2024 05:55 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఏలూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్న చంద్రబాబు.. రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకొని స్థానిక చైతన్య స్కూల్‌ కూడలిలో 2 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి 3.20 గంటలకు విమానాశ్రయం చేరుకొని మాచర్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని