icon icon icon
icon icon icon

Chandrababu: మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమిని గెలిపించాలి: చంద్రబాబు

తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 10 May 2024 17:54 IST

గన్నవరం: తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో వర్షంలో తడుస్తూనే చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్‌తో కలిపి 8 సార్లు తెదేపా విజయం సాధించిందన్నారు. అమెరికాలో పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు..  ప్రజలకు సేవ చేసేందుకే ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 

‘‘నవరత్నాల పేరుతో జగన్‌ మోసం చేశారు. ప్రజల ఆస్తులపై జగన్‌ ఫొటో ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తా. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తాం. వైకాపా రెండోసారి అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు. భూములు అమ్మాలన్నా..కొన్నాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవాల్సిందే. ఆస్తులు కొట్టేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులను టైటిల్‌ రిజిస్ట్రేషన్‌కు పెట్టారా.. లేదా? మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. వైకాపాకు ఓటేస్తే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. ఫ్యాన్‌కు ఓటు వేస్తే.. మీ మెడకు ఉరే. ప్రభుత్వ ఉద్యోగులను వైకాపా వేధించింది. అందుకే ఉద్యోగుల్లో నూటికి 90మంది కూటమికి ఓటేశారు’’ అని చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావడంతో గన్నవరం జనసంద్రంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img