logo

కూటమికే మా మద్దతు

గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్‌ ఆంజనేయులు అన్నారు.

Published : 10 May 2024 05:43 IST

 

ఐక్యత చాటుతున్న నాయకులు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్‌ ఆంజనేయులు అన్నారు. గురువారం నగరంలోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్‌ఎంపీలు రాష్ట్రవ్యాప్తంగా 60వేలమంది ఉన్నారని వారందరూ ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిలిపివేసిన పారామెడికల్‌ శిక్షణ మళ్లీ ప్రారంభించాలని, ఆరోగ్యబీమా, పింఛను సదుపాయం తదితర డిమాండ్లు జనవాణి కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌కు వివరించగా సానుకూలంగా స్పందించారని అన్నారు. అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మచిలీపట్నంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నాయకులు జి.నందగోపాల్‌, మల్లికార్జునుడు, డేవిడ్‌రాజు, హరిప్రసాద్‌, కె.వీరబాబు, బి.అర్జునరావు, ఎల్‌.దుర్గారావు, సీహెచ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని