logo

31న పీఎం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌

అజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 31న వర్చువల్‌గా ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులతో ముచ్చటిస్తారని కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల

Published : 26 May 2022 06:18 IST

ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష


అధికారులకు సూచనలిస్తోన్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: అజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 31న వర్చువల్‌గా ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులతో ముచ్చటిస్తారని కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఫొటోలతో గ్రామాలు, మండలాల వారీగా కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు జడ్పీ సీఈవో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు. ప్రతి పథకానికి సంబంధించి కనీసం 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌కు హాజరుపర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

పాలవెల్లువపై దృష్టి సారించాలి

జిల్లాలో పాలవెల్లువ కార్యక్రమం పురోగతిపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పాలసేకరణ తగ్గుతూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాకు మల్టీపర్పస్‌ సెంటర్‌ పథకం కింద మంజూరైన 106 గోదాముల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. జిల్లా కోఆపరేటివ్‌ అధికారి రవికుమార్‌, డీఆర్డీఏ పీడీ సునీత, పశుసంవర్థక శాఖ జేడీ చంద్రశేఖర్‌, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని