logo

వైద్యకేంద్రంగా కర్నూలు

సీమ   జిల్లాలో వైద్యరంగానికి కర్నూలు కేంద్రంగా మారింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు వివిధ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆధునిక సేవలు అందిస్తున్నారు.

Published : 04 Dec 2022 01:13 IST

కర్నూలు వైద్యాలయం : సీమ   జిల్లాలో వైద్యరంగానికి కర్నూలు కేంద్రంగా మారింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు వివిధ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆధునిక సేవలు అందిస్తున్నారు. దీంతో కర్నూలు వైద్యకేంద్రంగా విరాజిల్లుతోంది. గతంలో గుండె, క్యాన్సర్‌, లేజర్‌ వంటి శస్త్రచికిత్సలకు సీమప్రజలు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. గత పదేళ్ల కాలంలో కర్నూలులో గుండె శస్త్రచికిత్సలతోపాటు లేజర్‌, ఎండోస్కోపీ వంటి చికిత్సలతోపాటు అన్ని రకాల వైద్యపరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రోనగరాలకు వెళ్లే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు, వైద్యం అందుతోంది. జిల్లా నుంచే కాదు తెలంగాణ, కర్ణాటక నుంచి నిత్యం అనేకమంది నగరానికి వచ్చి చికిత్స పొందుతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదలకు అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో మేలైన సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వచ్చేవారికి కోసం ప్రత్యేక విభాగాలు ప్రారంభించారు. దీంతో సరికొత్త ఆరోగ్య సేవలకు కర్నూలు కేంద్రబిందువుగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని