logo

ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు

రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆరోపించారు.

Published : 27 Jan 2023 05:35 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఎస్టీయూ కార్యాలయంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. టీచర్లను ఒత్తిడికి గురిచేస్తూ ఆకస్మిక తనిఖీలు అంటూ బెంబేలు పెడుతున్నారని విమర్శించారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో సర్కార్‌కు గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న మాట్లాడుతూ రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా కత్తినరసింహారెడ్డిని గెలిపించి మన హక్కుల కోసం పోరాటాలు చేద్దామన్నారు. నాయకులు బసవరాజు, వెంకటేశ్వర్లు, తిమ్మన్న, ప్రసన్నరాజు, రామచంద్ర, తిమ్మరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని