logo

హత్యాస్థలంలో డాగ్‌స్క్వాడ్‌ పరిశీలన

కౌతాళం మండలం హాల్వి గ్రామంలో వైకాపా కార్యకర్త పింజారి హుసేన్‌ బాషా(37)ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన విధితమే.

Published : 31 Mar 2023 02:12 IST

హాల్వి: హత్య జరిగిన ప్రదేశంలో పోలీసుల తనిఖీలు

కౌతాళం, న్యూస్‌టుడే: కౌతాళం మండలం హాల్వి గ్రామంలో వైకాపా కార్యకర్త పింజారి హుసేన్‌ బాషా(37)ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన విధితమే. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో గురువారం ఉదయం డాగ్‌స్క్వాడ్‌తో క్లూస్‌ టీమ్‌ పోలీసులు తనిఖీ చేశారు. మృతదేహానికి ఆదోని ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష చేసి స్వగ్రామానికి తరలించారు. హాల్విలో సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. ఎస్సై నరేంద్రకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ మృతుడి భార్య వన్నూర్‌బీ ఫిర్యాదు మేరకు గ్రామంలో ఓ మసీదు స్థలం విషయంలో తగాదా ఉన్నాయని, దానికి సంబంధించి ఎవరైనా హత్యచేశారా? మరేమైనా ఇతర కారణాలతో హత్య చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. హత్యకు గల కారకులను పోలీసులు గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరినట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ ఎరిషావలి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని