logo

ప్రభుత్వ శాఖల్లో బదిలీలు

రాష్ట్ర వ్యవసాయశాఖ రాయలసీమ  జోనల్‌-4 స్థాయిలో వ్యవసాయాధికారులకు అంతర్గత, అంతర్‌ జిల్లాల బదిలీలు చేశారు.

Published : 02 Jun 2023 02:00 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ రాయలసీమ  జోనల్‌-4 స్థాయిలో వ్యవసాయాధికారులకు అంతర్గత, అంతర్‌ జిల్లాల బదిలీలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 మంది వ్యవసాయాధికారుల స్థానాలను మార్పు చేయగా కడప జిల్లా నుంచి ఒకరు కర్నూలుకు, అనంతపురం జిల్లా నుంచి ఒకరు నంద్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.

పశుసంవర్ధక శాఖలో.. : కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం కటారుకొండ పశువైద్యులు బి.సునీల్‌కుమార్‌ కనగానపల్లికి, ముక్కెళ్ల పశువైద్యులు వి.వినయ్‌కుమార్‌ను కటారుకొండకు బదిలీ చేస్తూ పశుసంవర్ధకశాఖ డైరక్టర్‌ అమరేంద్రకుమార్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్తగా వెంకట్రావ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడప జిల్లా సమన్వయకర్తగా పని చేస్తున్నారు. ఇక్కడున్న శ్రీదేవి తూర్పుగోదావరికి బదిలీ అయ్యారు.


జిల్లా సహాయ కమిషనర్‌కు స్థానచలనం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: దేవాదాయశాఖ కర్నూలు జిల్లా సహాయ కమిషనర్‌ ఆదిశేషనాయుడును అనంతపురం జిల్లాకు, అక్కడ సహాయ కమిషనర్‌గాఉన్న రామాంజనేయులును కర్నూలుకు బదిలీ చేస్తూ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదిశేషనాయుడు నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లాలో ఈవోగా పనిచేసిన రామాంజనేయులు పదోన్నతిపై అనంతపురానికి బదిలీ అయ్యారు. ఆయన తిరిగి కర్నూలు జిల్లాకు వస్తున్నారు. వీరిరువురితోపాటు మహానంది, శ్రీశైలం, ఉరుకుంద దేవస్థానాల్లోని కొందరు ఉద్యోగులకు స్థానచలనం కలిగింది.


డిప్యూటీ సర్వేయర్లు సైతం..

కర్నూలు సచివాలయం : సర్వే శాఖలో ఏడుగురు డిప్యూటీ సర్వేయర్లకు బదిలీలు చేస్తూ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సర్వే ఏడీ పవన్‌కుమార్‌ గురువారం తెలిపారు. కర్నూలులో పనిచేస్తున్న జి.తిమ్మారెడ్డిని అన్నమయ్య జిల్లా గాలివీడుకు, ఎస్‌.అతీఫ్‌ను కర్నూలు నుంచి నంద్యాలకు, దేవనకొండ సర్వేయర్‌ అరుణజ్యోతిని ఆలూరుకు, ఆలూరు సర్వేయర్‌ ఈశ్వరప్రసన్నను సత్యసాయి జిల్లా ఓడిచెర్వుకు, ఎమ్మిగనూరులో పనిచేస్తున్న అశోక్‌ను సత్యసాయి జిల్లా ఎన్‌.పి.కుంటకు, కర్నూలులో పనిచేస్తున్న మల్లేశ్వరిని పాణ్యంకు, కర్నూలులో పనిచేస్తున్న శ్రీధర్‌ను చిత్తూరు ఏడీ కార్యాలయానికి బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని