logo

బండి కడితేనే.. గొంతు తడిసేది

తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Published : 25 Apr 2024 05:18 IST

తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీరు అవసరమైన వారు ఎద్దుల బండి, ద్విచక్ర వాహనాలతో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న నీటి సంపుల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానికి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. 

 - న్యూస్‌టుడే, హొళగుంద


సమస్య చెప్పినా.. వినిపించుకోరు

విద్యార్థి గళం 

 పత్తికొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: అసలే వేసవి కాలం దాహం తీర్చుకోవడానికి విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నా.. కళాశాల యాజమాన్యం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేశాక చేతులు కడుక్కునేందుకు ఉప్పు నీరు తప్ప తాగేందుకు నీరు లేదని పేర్కొంటున్నారు. గతంలో ప్రతి తరగతి గది వద్ద ఓ శుద్ధజలం క్యాన్‌ అందుబాటులో ఉండేదని... రెండు నెలలుగా అసలు తాగునీటి సంగతే మరిచిపోయారని వాపోయారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు