logo

కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్‌తోపాటు ఇచ్చిన అఫిడవిట్‌లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్‌ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు.

Published : 24 Apr 2024 05:04 IST

ఆయన భార్య పేరుతో 164.33 ఎకరాలు

ఈనాడు, కర్నూలు : పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్‌తోపాటు ఇచ్చిన అఫిడవిట్‌లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్‌ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సవరించిన అంశాలతో కూడిన అఫిడవిట్‌ను ఆయన మంగళవారం అధికారులకు సమర్పించారు. కాటసాని, ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిపై ఉన్న చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.48.24 కోట్లుగా ఉంది. మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లు.. అప్పులు రూ.3.01 కోట్లుగా చూపారు. కాటసాని పేరుతో 10.87 ఎకరాల భూమి, ఆయన సతీమణికి 164.33 ఎకరాలు, కుమారుడికి 64.56 ఎకరాలు, ఒక కుమార్తెకు 2.93 ఎకరాలు, మరో కుమార్తెకు 2.91 ఎకరాలు ఉన్నట్లు చూపారు. ఆయన సతీమణికి మొత్తం 34 చోట్ల, కుమారుడికి 20 చోట్ల ఆయా భూములున్నాయి.

ఒకే ఒక్క కేసు..: కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకే ఒక్క కేసు ఉండడం గమనార్హం. అదికూడా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి డబ్బులు పంపిణీ చేశారన్నది ఆరోపణ. సెక్షన్‌ 171(ఇ) కింద ఆ కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని