logo

పూర్తయిన మగ్గాల సర్వే

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేపడుతున్న క్లస్టర్ పథకం మగ్గాల పరిశీలన గురువారంతో పూర్తయ్యింది.

Published : 28 Mar 2024 19:54 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేపడుతున్న క్లస్టర్ పథకం మగ్గాల పరిశీలన గురువారంతో పూర్తయ్యింది. చేనేత క్లస్టర్ పథకం ప్రారంభానికి సంబంధించి మొత్తం 400 మంది జాబితా రాగా, వారికి సంబంధించి సీడీఈ శివకుమార్ ఇంటింటికి వెళ్లి మగ్గాలను పరిశీలించారు. మగ్గం మనుగడలో ఉందా? ఆధార్, బ్యాంకు వివరాలతో పాటు, ఎలాంటి రాయితీ పరికరాలు కోరుకుంటున్నారనే వివరాలను ఆయన సేకరించారు. వందశాతం మగ్గాలను పరిశీలించామని, రూ.1.30 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుండగా, మొదటి విడతగా సగం నిధులు త్వరలోనే రానున్నాయన్నారు. రాగానే పథకం ప్రారంభానికి జిల్లా ఏడీ ఆదేశాలతో చర్యలు చేపడతామని సీడీఈ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని