logo

నిర్ధారించు.. గుర్తించు.. ఔషధాలు పంచు!

కరోనా మూడో దశ వ్యాప్తి విస్తృతమవుతోంది. తీవ్రత తక్కువైనా.. బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకు ఉద్ధృతి చాటుతున్న వైరస్‌తో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. అనుమానితులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా సిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నిత్యం పరీక్షల సంఖ్య పెంచుతున్నారు. రోజులో 2 వేలకు పైగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌, 300 నుంచి 350 వరకు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు.

Published : 21 Jan 2022 02:12 IST

జిల్లాలో కరోనా పరీక్షల పెంపు.. అనుగుణంగా కిట్లు
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

సిద్దిపేటలో కరోనా నిర్ధారణ పరీక్షలు

రోనా మూడో దశ వ్యాప్తి విస్తృతమవుతోంది. తీవ్రత తక్కువైనా.. బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకు ఉద్ధృతి చాటుతున్న వైరస్‌తో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. అనుమానితులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా సిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నిత్యం పరీక్షల సంఖ్య పెంచుతున్నారు. రోజులో 2 వేలకు పైగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌, 300 నుంచి 350 వరకు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈమేరకు ఐసోలేషన్‌ (ఔషధాల) కిట్లు పంపిణీ చేస్తున్నారు. అవసరం మేర ఏఎన్‌ఎం/ఆశల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు.

జిల్లాలో 42 ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 33 పీహెచ్‌సీలు, ఒకటి చొప్పున జీజీహెచ్‌, జిల్లా ఆసుపత్రి, రెండు యూపీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు, సిద్దిపేటలోని లెప్రసీ, హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సేవలు అందుతున్నాయి. ఆసుపత్రుల్లో డిమాండ్‌కు అనుగుణంగా ఉదయం 9 గంటల నుంచి సిబ్బంది ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీసీపీఎస్‌ విషయానికొస్తే.. పీహెచ్‌సీల్లో ఐదు, జిల్లా ఆసుపత్రి సహా సీహెచ్‌సీల్లో 20 చొప్పున, సిద్దిపేటలోని జీజీహెచ్‌, లెప్రసీ దవాఖానాల్లో పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే క్రమంలో రానున్న మూడు వారాలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఔషధాల కిట్‌..

14 మంది ఆసుపత్రుల్లో..
జిల్లాలో క్రమంగా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. అదేస్థాయిలో నిర్ధారణ పరీక్షలు పెంచి బాధితులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల ఆరంభంలో మొదటి రోజు 361 ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 20వ తేదీన ఆ సంఖ్య 2 వేలు అధిగమించింది. లక్షణాలు ఉంటే నేరుగా నిర్ధారణ కేంద్రాలకు వెళ్లడం ద్వారా అనుమాన నివృత్తి జరుగుతోంది. గత నెలతో పోల్చితే.. ఈనెలలో 20 రోజుల్లోనే రెట్టింపుస్థాయిలో పరీక్షలు చేయడం గమనార్హం. పాజిటివ్‌ కేసులు పదింతలు పెరగడం ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు.. 31,913 మందికి వైరస్‌ సోకింది. అందులో 30,786 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 966 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నేటి నుంచి ‘ఇంటింటి ఆరోగ్యం’...
జిల్లాలో ‘ఇంటింటి ఆరోగ్యం’ (ఫీవర్‌ సర్వే) పేరిట నేటి నుంచి లాంఛనంగా ప్రారంభమవనుంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కార్యక్రమం కొనసాగనుంది. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీలు, పంచాయతీ కార్యదర్శి, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరగనున్నారు. సర్వేలో భాగంగా వ్యాక్సినేషన్‌ తీరు, జలుబు, జ్వరం ఇతరత్రావి నమోదు చేయనున్నారు. కొవిడ్‌ వేళ ముందు జాగ్రత్తలను వివరించనున్నారు. ఆరు రోజుల పాటు సర్వే కొనసాగనుంది. అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఐసోలేషన్‌ కిట్లు అందిస్తారు. అవసరం మేర ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. జిల్లాలో గురువారం నుంచే కొన్ని చోట్ల సర్వే చేపట్టడం విశేషం.


ఆందోళన వద్దు.. జాగ్రత్తపడండి
-మనోహర్‌, జిల్లా వైద్యాధికారి

ఆందోళనకు గురికాకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. మాస్కుధారణ, భౌతిదూరం విస్మరించవద్దు. ఆరోగ్య సర్వేకు అందరూ సహకరించాలి. సామూహిక కార్యక్రమాలు, వేడుకలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని