logo

అంతర్జాల పాఠాలకు ఏర్పాట్లు

కరోనా పరిస్థితుల కారణంతో విద్యార్థులకు మళ్లీ అంతర్జాల తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నెల 16వ తేదీకి సంక్రాంతి సెలవులు ముగిసినా.. కొవిడ్‌ ఉద్ధృతి వల్ల ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం

Published : 24 Jan 2022 01:05 IST

8-10 తరగతులకు అవకాశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

కరోనా పరిస్థితుల కారణంతో విద్యార్థులకు మళ్లీ అంతర్జాల తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నెల 16వ తేదీకి సంక్రాంతి సెలవులు ముగిసినా.. కొవిడ్‌ ఉద్ధృతి వల్ల ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాల తరగతులు ప్రారంభం కాలేదు. ప్రైవేట్‌ బడుల్లో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. సర్కారు విద్యాలయాల్లో నేటి (సోమవారం) నుంచి 8-10 తరగతుల విద్యార్థులకు అంతర్జాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు పూర్తి చేశారని జిల్లా విద్యాధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్ల తీరుపై కథనం.

32,190 మంది విద్యార్థులు..

జిల్లాలో ప్రభుత్వ, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు 235 ఉన్నాయి. వాటిలో 32,190 మంది 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులున్నారు. వీరికి సోమవారం నుంచి అంతర్జాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ బాధ్యతను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఈ నెల చివరి వరకు ఈ ఆన్‌లైన్‌ తరగతులు జరిగే అవకాశం ఉండటంతో ప్రతి రోజు.. అందరు విద్యార్థులు పాఠాలు వినేలా చరవాణుల పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రోజుకు 50 శాతం మంది చొప్పున ఉపాధ్యాయులు పాఠశాలలకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. బడుల నుంచే విద్యార్థుల హాజరను ప్రధానోపాధ్యాయులు పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి నివేదిక పంపాలి. ఎంత మంది విద్యార్థులు అంతర్జాల తరగతులు వింటున్నారో స్పష్టంగా తెలియజేయాలి. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీరికి పునఃశ్చరణ తరగతులు, వర్క్‌షీట్లు పంపించడం, నిరంతర మూల్యాంకణం చేయాలని పేర్కొన్నారు.

అందరూ వినేలా చూడాలి

- రాజేశ్‌, జిల్లా విద్యాధికారి

8-10 తరగతుల విద్యార్థులు అందరూ అంతర్జాల తరగతులు తరగతులు వినేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని