logo

హస్తంతోనే అన్నదాతల సంక్షేమం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అన్నదాతల సంక్షేమం హస్తం పార్టీతోనే సాధ్యమని పీసీసీ స్టార్‌ క్యాంపేయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మాజీ మంత్రి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం

Published : 23 May 2022 02:12 IST

అల్గోలులో నిర్వహించిన రచ్చబండలో రైతుతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నాయకులు

జహీరాబాద్‌ అర్బన్‌: అన్నదాతల సంక్షేమం హస్తం పార్టీతోనే సాధ్యమని పీసీసీ స్టార్‌ క్యాంపేయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మాజీ మంత్రి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ రైతు భరోసా రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి మద్దతు ధర, సాగు కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ సర్కారు కేవలం మాటల ప్రభుత్వమని చేతల్లో చేసిందేమి లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కష్టపడి తెచ్చిన నిమ్జ్‌కు నిధులు కేటాయించని దుస్థితి నెలకొందన్నారు. సంగమేశ్వర పథకంతో జహీరాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామని ప్రకటిస్తున్న నాయకులు, అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడే దీనిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా మద్దతు ధర కల్పిస్తామని కాంగ్రెస్‌ను ప్రజలు ఆశ్వీరదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, జడ్పీటీసీ నాగిశెట్టి రాథోడ్‌, సర్పంచి జ్యోతి, నాయకులు నర్సింహారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని