logo

మోసం తేటతెల్లం.. మహిళ అరెస్టు

బ్యాంకుకు, మహిళా సంఘాలకు అనుసంధానంగా పని చేసిన ఓ మహిళ.. మహిళా సంఘాల సభ్యులను మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిజాంపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Published : 24 Jun 2022 02:26 IST

నిజాంపేట (రామాయంపేట), న్యూస్‌టుడే: బ్యాంకుకు, మహిళా సంఘాలకు అనుసంధానంగా పని చేసిన ఓ మహిళ.. మహిళా సంఘాల సభ్యులను మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిజాంపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు నందిగామకు చెందిన బిజ్జ ప్రవీణ స్థానిక మహిళా సంఘాలకు రామాయంపేట పట్టణంలోని సెంట్రల్‌ బ్యాంకుకు, అత్యాతి టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ద్వారా అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. 27 సంఘాలకు సంబంధించిన సభ్యులు పలువురు సెంట్రల్‌ బ్యాంకులో రుణాలు పొందారు. వారు ప్రతి నెలా వాయిదాలకు సంబంధించిన నగదును ప్రవీణకు చెల్లించేవారు. ఆమె వాటిని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. రుణవాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు గ్రామానికి వెళ్లి సభ్యులతో చర్చించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అత్యాతి టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సహాయ మేనేజర్‌ ఆదర్శ కిశోర్‌గౌడ్‌ మే 19న ప్రవీణపై నిజాంపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. సభ్యులకు చెందిన రూ.85 లక్షల మేర వాడుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు. గురువారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంఘాలకు సీసీగా వ్యవహరిస్తున్న మల్లేశం పాత్ర సైతం ఇందులో ఉంది. ఆయన పరారీలో ఉన్నాడన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై విచారణ కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని