logo

హరితవనాల నిధుల గోల్‌మాల్‌పై విచారణ

హరితవనాల నిధుల గోల్‌మాల్‌పై త్రీమెన్‌ కమిటీ విచారణ జరుగుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ విరోజ తెలిపారు.

Published : 30 Nov 2022 05:32 IST

అధికారితో మాట్లాడుతున్న పీడీ విరోజ

కౌడిపల్లి, న్యూస్‌టుడే: హరితవనాల నిధుల గోల్‌మాల్‌పై త్రీమెన్‌ కమిటీ విచారణ జరుగుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ విరోజ తెలిపారు. కౌడిపల్లి మండలం కొట్టాల అటవీప్రాంతంలో నాటిన మొక్కలను మంగళవారం తహసీల్దార్‌ కమలాద్రి, అటవీశాఖ రేంజి అధికారి ఎల్లయ్య, డిప్యూటీ రేంజి అధికారిణి రాజమణిలతో కలిసి ఆమె పరిశీలించారు. 2019-20లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హరితవనాల్లో నాటిన మొక్కల నిర్వహణకు సంబంధించి అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కొమురయ్య పేరుమీద రూ.16.40 లక్షల చెల్లింపులపై  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ పాలనాధికారికి నివేదిక పంపించడంతో విచారణకు ఆదేశించారు. ఈ విషయమై అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ విరోజ మాట్లాడుతూ.. త్రీ మెన్‌ కమిటీ ద్వారా విచారణ జరుగుతోందని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత  నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. పంచాయతీ ఖాతాలో మొక్కలకు సంబంధించిన నిధులు రావడంతో చెల్లించేందుకు సర్పంచి, ఉప సర్పంచి, ఉపాధి హామీ సాంకేతిక సహాయకురాలు, క్షేత్ర సహాయకుడి కలిపి రూ.6.22 లక్షలు సమర్పించినట్లుగా కొమురయ్య అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేసి ఆధారాలు సమర్పించారు. సర్పంచి నరహరి, ఉపసర్పంచి మాధవరెడ్డి, ఏపీవో పుణ్యదాస్‌, ఈసీ ప్రేమ్‌కుమార్‌, తెరాస గ్రామం ‹ఖ అధ్యక్షులు గౌరిరెడ్డి గ్రామస్థులు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని