logo

శిలను తడిపిన జల

కూడవెల్లి వాగు పరివాహక ప్రాంతమంతా గోదావరి జలాల కళ తాండవిస్తోంది. ఈ నెల 3న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి.. హల్దీ, కూడవెల్లి వాగుల్లోకి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Published : 08 Feb 2023 02:03 IST

పొరుగు జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి పరవళ్లు
న్యూస్‌టుడే, వర్గల్‌, దుబ్బాక

నాచగిరి హల్దీ చెక్‌డ్యాంలో ఇలా..

కూడవెల్లి వాగు పరివాహక ప్రాంతమంతా గోదావరి జలాల కళ తాండవిస్తోంది. ఈ నెల 3న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి.. హల్దీ, కూడవెల్లి వాగుల్లోకి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి వాగు 60 కి.మీ. మేర ప్రవహిస్తుంది. గజ్వేల్‌, తొగుట, మిరుదొడ్డి మండలాల మీదుగా నాలుగు రోజులుగా నీరు ప్రవహించింది. మంగళవారం ఉదయం దుబ్బాక మండలం ఆకారం వాగులోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి గోసాన్‌పల్లి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరుకు మంగళవారం రాత్రికి చేరాయి. కూడవెల్లి రామలింగేశ్వరస్వామి అర్చకులు వాగులోని జలాలకు పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. ఆకారం వాగు వద్దకు స్థానికులతో పాటు కామారెడ్డి జిల్లా తుజాల్‌పూర్‌ వాసులు, మత్స్య కారులు తరలి వచ్చారు.

ఆహ్లాదంగా నాచగిరి    పరిసరాలు

వర్షాకాలంలో నిండుకుండలా కనిపించి పరవళ్లు దూకుతు భక్తులకు పారవశ్యాన్ని కల్పించిన నాచగిరి హల్దీ చెక్‌డ్యాం రెండు నెలలుగా ఎండిపోయి బోసిగా కనిపించింది. ఇటీవల కొండపోచమ్మ సాగర్‌ నుంచి అవుసులోనిపల్లి వద్ద గోదావరి జలాలను హల్దీ వాగులోకి విడుదల చేయటంతో నాచగిరి వద్ద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎండలు ముదురుతున వేళ జల కళ స్థానికులను పరవశుల్ని చేస్తోంది. రోడ్డుపై వాహనదారులు కాసేపు నిలిచి ప్రవాహాన్ని తిలకిస్తూ వెళ్తున్నారు. పరిసర బోర్లలో భూగర్భ జలాలు పెరిగి, పంటలకు మేలు  చేస్తాయని రైతులు ఆనందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని