logo

ఒకే కాన్పులో నలుగురు జననం: తల్లీపిల్లలు క్షేమం

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని పీపుల్స్‌ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 29 Mar 2023 06:40 IST

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని పీపుల్స్‌ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. డాక్టర్‌ శంకర్‌ తెలిపిన వివరాల మేరకు... గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌కు చెందిన గొట్టిముక్కుల లావణ్య-కిషన్‌ దంపతులు. లావణ్య బీడీ కార్మికురాలు. కిషన్‌ వ్యవసాయ కూలీ. వీరికి మొదటి కాన్పులో బాబు జన్మించాడు. మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం జరిగిన రెండో కాన్పులో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడశిశువుకు లావణ్య జన్మనిచ్చింది. డాక్టర్‌ చింతోజు శంకర్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ అఖిల, డాక్టర్‌ తేజస్విన్‌ శస్త్రచికిత్స చేసి నలుగురు పిల్లలను బయటకు తీశారు. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలు ఒక్కొక్కరు 1.25 కేజీల బరువు ఉన్నారు. శిశువులను ముందు జాగ్రత్తగా సిద్దిపేటలోని పిల్లల ఆసుపత్రికి పంపించినట్లు డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. 10 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందని, ఇది అరుదైన కాన్పు అని ఆయన పేర్కొన్నారు. తన అనుభవంలో ఇది రెండో కేసు అని చెప్పారు. సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో శిశువులకు చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని