logo

నేతల పక్క చూపులు

కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన భారాసకు నష్టం లేదు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి..

Published : 17 Apr 2024 03:19 IST

అసెంబ్లీ ఎన్నికలకంటే అధిక మెజార్టీ సాధిస్తాం

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్‌ తన్వీర్‌, నాయకులు

కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన భారాసకు నష్టం లేదు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. జహీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో భారాసకు బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రతి సమావేశానికి స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు సహకారంతో నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలకంటే ఇప్పుడు అధిక మెజార్టీ సాధిస్తాం. మంగళవారం జరిగిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి భారాస సభ విజయవంతమైంది. మాజీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వద్దకు తీసుకెళతాం. రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తాం.- దేవీప్రసాద్‌, భారాస జహీరాబాద్‌ నియోజకవర్గ సమన్వయకర్త.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని