logo

కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం అత్యధికంగా 126 మంది కొవిడ్‌ బారినపడ్డారు. మూడోదశ మొదలైన అత్యధికంగా నమోదు కావడం మొదటిసారి. 1187

Published : 18 Jan 2022 02:40 IST

126 పాజిటివ్‌ కేసులు నమోదు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం అత్యధికంగా 126 మంది కొవిడ్‌ బారినపడ్డారు. మూడోదశ మొదలైన అత్యధికంగా నమోదు కావడం మొదటిసారి. 1187 మందిని పరీక్షించగా 126 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సోమవారం 10.61 పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యధికంగా యాదగిరిగుట్ట, వర్కట్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలో 16 కేసులు చొప్పున రాగా, రామన్నపేటలో 11, మోత్కూరు, వలిగొండ పీహెచ్‌సీల పరిధిలో పది చొప్పున, వేములకొండపరిధిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. మిగతా పీహెచ్‌సీలలో పదిలోపు కేసులు వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. సోమవారం వచ్చిన కేసుల్లో సాధారణ ప్రజలతోపాటు, పోలీసులు ఉన్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట సర్కిల్‌ పరిధిలో పలువురు పోలీసులు కొవిడ్‌ బారిన పడగా భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌తోపాటు, డీసీపీ క్యాంపు కార్యాలయ సిబ్బంది కొంతమంది సోమవారం కొవిడ్‌ బారినపడినట్లు తెలిసింది. ఇప్పటివరకు అధికారికంగా 30 మంది పోలీసులకు కొవిడ్‌ సోకినట్లు వివరాలు సేకరించగా ఇంకా మరికొంతమంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగతుండటంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కేసులు కట్టడికి స్వీయనియంత్రణ పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 750 యాక్టివ్‌ కేసులున్నాయి.

టీకాల పంపిణీ..: 684 మంది కౌమారులకు సోమవారం టీకా వేశారు. ఇతరులకు 492 మంది టీకా తీసుకున్నారు. 304 మందికి ముందస్తు నివారణ టీకాను వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని