logo

నేటి నుంచి ఇంటింటా జ్వర సర్వే

వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1,415 బృందాలు శుక్రవారం నుంచి 30 ఇళ్ల చొప్పున సర్వే నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది ఉంటారు. పది రోజుల పాటు జరిగే ఈ సర్వేలో జ్వరంతో పాటు దగ్గు, జలుబు

Published : 21 Jan 2022 02:35 IST

బాధితులకు ఇంటి వద్దే కొవిడ్‌ కిట్లు

దూరదృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, తదితరులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1,415 బృందాలు శుక్రవారం నుంచి 30 ఇళ్ల చొప్పున సర్వే నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది ఉంటారు. పది రోజుల పాటు జరిగే ఈ సర్వేలో జ్వరంతో పాటు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నవారి వివరాలు సేకరిస్తారు. జ్వర బాధితులను గుర్తించి గ్రామాల్లో ఉన్న యూపీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే కొవిడ్‌ కిట్లు ఇవ్వడంతో పాటు హోం క్వారంటైన్‌లో ఉండేలా సూచనలు చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 15వేల కొవిడ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్‌రావు తెలిపారు. జిల్లాలో గురువారం 305 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.

నల్గొండ సంక్షేమం: కొవిడ్‌ నియంత్రణకు శుక్రవారం నుంచి ఇంటింటి ఆరోగ్య, జ్వర సర్వే నిర్వహించాలని మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కొవిడ్‌ నియంత్రణపై ఏర్పాటు చేసిన దూరదృశ్య శ్రవణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఎంహెచ్‌వో కొండల్‌రావు పాల్గొన్నారు.

మాడ్గులపల్లి: కొవిడ్‌ను జయించాలంటే టీకానే రక్ష అని డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక బృందం అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని చెర్వుపల్లి, మాడ్గులపల్లి గ్రామాల్లో కొవిడ్‌ టీకాల పంపిణీ తీరును గురువారం పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకుంటే కరోనా ముప్పు ఉండబోదన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తిప్పర్తి పీహెచ్‌సీ వైద్యురాలు అనూష, తదితరులు పాల్గొన్నారు.

చండూరు: చండూరు పురపాలికలో శుక్రవారం నుంచి జరగనున్న జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కమిషనర్‌ వెంకట్రాం గురువారం కోరారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని