logo

భాజపా పాలనలో సమాఖ్య వ్యవస్థకు భంగం: గుత్తా

భాజపా పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సాగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లను భయాందోళనకు గురి చేస్తూ..

Published : 25 Jan 2022 05:25 IST

సాగర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: భాజపా పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సాగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లను భయాందోళనకు గురి చేస్తూ.. వాటికి రాష్ట్రప్రభుత్వాలు సహాయాన్ని అందించలేని విధంగా వ్యవహరిస్తున్నారని.. కమిషన్‌లను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వమే నిబంధనలను విధిస్తే, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తన నివాసగృహంలో వందలాది మంది కార్యకర్తలతో ఆందోళన నిర్వహిస్తూ నిబంధనలను తుంగలో తోక్కారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న తెరాస ప్రభుత్వాన్ని దూషిండమే తమ పనిగా భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు పెట్టుకున్నాయన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిచడానికి కృషిచేస్తోందని వివరించారు. ఏ ఉద్యోగికీ నష్టం లేకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు. సాగర్‌లోని నివాసగృహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నుంచి త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్నారు. రూ.150 కోట్ల సీడీసీ నిధులతో సాగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, పుర వైస్‌ ఛైర్మన్‌ రఘువీర్‌, తెరాస నాయకులు బ్రహ్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
వారం రోజుల్లో 2,356 మందికి పాజిటివ్‌

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా బాధితులు క్రమేణా పెరుగుతున్నారు. పొలీసులు, ఇతర ఉన్నతస్థాయి అధికారులు కొవిడ్‌ నిబంధనలపై నిత్యం ప్రచారం చేస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. దీంతో కొవిడ్‌ బాధితులతో పాటు జ్వరం, జలుబు, దగ్గు, వంటి లక్షణాలున్నవారు ప్రతి ఇంటా కన్పిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జ్వర సర్వేలు చేసి సూచనలు చేయడంతో పాటు బాధితులకు కొవిడ్‌ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రారంభంలో కొవిడ్‌ వార్డులో ఉండడానికి సుముఖత చూపని బాధితులు ఇటీవల కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనరల్‌ ఆసుపత్రి వార్డుల్లో చేరుతున్నారు. జిల్లాలో గడిచిన వారం రోజుల్లో కొవిడ్‌ బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి.


జీవో నం.62ను రద్దు చేయాలంటూ ధర్నా

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.62ను వెంటనే రద్దు చేయాలని సాగర్‌ జెన్‌కో ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జెన్‌కో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు వంగూరు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నం.62 జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో నష్టం కలుగుతుందని.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంజయ్య, రాజేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని