logo

భాజపాకు బండ్రు శోభారాణి రాజీనామా..?

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాల కారణంగా పార్టీలో కొనసాగలేక పోతున్నానని పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపినప్పటికీ

Published : 29 May 2022 06:03 IST

ఆలేరు, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాల కారణంగా పార్టీలో కొనసాగలేక పోతున్నానని పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపినప్పటికీ పట్టించుకోలేదని తన సహచరులతో ఆమె ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి లేఖ పంపినట్లు సమాచారం. తెరాస, తెదేపా, నవతెలంగాణ, ప్రజారాజ్యం పార్టీల్లో ముఖ్య నాయకురాలిగా పనిచేసిన శోభారాణి రెండేళ్ల క్రితం భాజపాలో చేరారు. ఆలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేసి అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ భాజపాలో చేరాక.. కొంత ముభావంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీనామా విషయమై ‘న్యూస్‌టుడే’ ఫోనులో ఆమెను సంప్రదించే ప్రయత్నం చేయగా రెండు రోజులుగా ఫోన్‌ పనిచేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని