logo

పెద్దగట్టు జాతర నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక: ఎస్పీ

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరయిన పెద్దగట్టు ఉత్పవాల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్‌ బందోబస్తుకు కావాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 05:00 IST

దురాజ్‌పల్లి పెద్దగట్టు పరిసరాలను పోలీస్‌ సిబ్బందితో కలిసి
పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

చివ్వెంల, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరయిన పెద్దగట్టు ఉత్పవాల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్‌ బందోబస్తుకు కావాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సూర్యాపేట పురపాలిక పరిధి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టును శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జాతరకు పెద్దసంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వాహనాల మళ్లింపు, పార్కింగ్‌ తదితర అంశాలపై చర్చించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తమ సిబ్బంది ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. జాతర ప్రాంగణంలో రక్షణ ఏర్పాట్లకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట డీసీˆఆర్‌బీ డీఎస్పీ రవి, గ్రామీణ ఇన్‌స్పెక్టర్‌ సోమ్‌నారాయణసింగ్‌, చివ్వెంల అదనపు ఎస్సై మధు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని